ఏదైనా స్కీమ్ మీరు మీ దగ్గర వున్న డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే చాలా స్కీమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన స్కీమ్ లో మీరు డబ్బుల్ని ఇన్వెస్ట్ చెయ్యచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లో పలు రకాల పథకాలు వున్నాయి. వీటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు పొందొచ్చు.
ఈ స్కీమ్స్ లో ఎన్‌పీఎస్ కూడా ఒకటి. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే అదిరే రాబడిని మీరు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS లో డబ్బులు పెడితే చాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. పైగా దీనిలో డబ్బులు పెడితే ఒకేసారి డబ్బుల్ని తీసుకొచ్చు.
ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. నెల నెలా పెన్షన్ కూడా లభిస్తుంది. దీని వలన ఇలా చాలా లాభాలున్నాయి కనుక ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈ స్కీమ్ లో చేరుతూ ఉంటారు. ఇక ఎలా డబ్బులొస్తాయి అనేది చూస్తే… ఈ స్కీమ్ లో దాదాపు 24 ఏళ్ల వయసులో వున్నవారు చేరితే మంచిగా లాభం వస్తుంది.
రోజుకు రూ.400 పొదుపుతో నెల చివరిలో రూ.12 వేలు ఎన్‌పీఎస్‌లో పెడితే మెచ్యూరిటీ సమయంలో డబ్బులొస్తాయ్. మెచ్యూరిటీ సమయానికి రూ.5 కోట్లని పొందొచ్చు. దీనిలో మీరు 60 శాతం విత్‌డ్రా చెయ్యచ్చు. మిగిలిన దానిని మీరు యాన్యుటీ స్కీమ్‌లో పెట్టాలి. అంటే రూ.3 కోట్లు చేతికి వస్తాయి. ఇంకా రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. దీనితో మీకు నెలకు రూ.లక్ష పెన్షన్ వస్తుంది. యాన్యుటీ రేటును 6 శాతంగా వుంది.