కిస్మిస్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు… హైబీపీ, కంటి సమస్యలకు చెక్

-

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య అలవాట్ల కారణంగా మూడు పదులు నిండక ముందే హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి వ్యాధుల దరిచేరుతున్నాయి. అయితే కొన్ని సార్లు మన చుట్టూ ఉండే డ్రైఫ్రూట్స్ ను తక్కువగా అంచనా వేస్తాం. వీటి వల్ల ఉండే ఉపయోగాలు తెలియకపోవడంతో మనం తీసుకోము. డ్రైఫ్రూట్స్ లో బాదం మాత్రమే చాలా మంది తింటుంటారు… కానీ కిస్మిస్ తినడానికి పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఆసక్తి చూపరు. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలియవు కాబట్టే. ఇప్పుడు కిస్మిస్ వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం..

కిస్మిస్ రోజూ తీసుకోవడం వల్ల రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు. కిస్మిస్ లలో బీ కాంప్లెక్స్ విటమిన్ ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇటీవల కాలంలో హైబీపీ సర్వ సాధారణంగా కనిపిస్తోంది. అలాంటి వాళ్లు ప్రతీ రోజూ 8 నుంచి 10 కిస్మిస్ లను నీళ్లలో నానబెట్టి…తర్వాతి రోజు ఉదయం ఆనీటిని నానబెట్టిన కిస్మిస్ లను తింటే హైబీపీ నుంచి బయటపడవచ్చు. కంటి చూపుకు ఆపిల్ మంచిదని అందరూ భావిస్తుంటారు. అయితే కిస్మిస్ వల్ల కూడా కంటి చూపు మెరుగవుతుంది. కంటి కణాలకు ప్రయోజనం చేకూర్చే యాంటీ ఆక్సిడెంట్లు కిస్మిస్ లో ఉంటాయి. ఇవి కంటి చూపును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను శరీరంలో తగ్గిస్తాయి. కంటిశుక్లం రాకుండా కిస్మిస్ లు ఉపయోగపడుతాయి. ఇదే విధంగా కాలేయానికి కిస్మిస్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. కిస్మిస్ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల బాడి మెటబాలిజాన్ని సమతౌల్య పరుస్తోంది. ఫలితంగా శరీరం సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news