మీకు కావాల్సిన వాళ్ళని తెలియకుండా హర్ట్ చేశారా? ఐతే ఈ విధంగా కూల్ చేయండి.

-

చాలాసార్లు మీకు తెలియకుండానే కావాల్సిన వాళ్ళని హర్ట్ చేసిన సందర్భాలు జరుగుతుంటాయి. కావాలని కాకుండా ఏదో మీరనుకున్న ఆలోచన, మీకు కావాల్సిన వాళ్ళ మీద మీరనుకున్నట్టుగా కాకుండా ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అలాంటి టైమ్ లో వారిని కంఫర్ట్ లోకి తీసుకురావడం చాలా ముఖ్యం. లేదంటే అదే చిన్న అసౌకర్యం, పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏం చేస్తే ఆ పరిస్థితుల నుండి బయటపడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

 

relationship partners

ఆ టాపిక్ ని వదిలేయకండి

ఏ టాపిక్ ఐతే అవతలి వారికి ఇబ్బంది కలిగించిందో దాని గురించి పూర్తిగా వదిలేసి అంతా మర్చిపోయినట్టు బిల్డప్ ఇవ్వకండి. దాని గురించి మాట్లాడండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందో వారికి తెలియజేయండి. అవసరమైతే సారీ చెప్పండి. ఇక్కడ ఇగోలకు పోతే అనవసరంగా మీరే నష్టపోతారు.

వ్యూహాలు మార్చండి

అందరికీ ఒకే వ్యూహం పనిచయకపోవచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కో వ్యూహం ఉంటుంది. మీ భాగస్వామిని హర్ట్ చేసిన అంశం, గురించి వివరణ ఇస్తూనే, ఏ విధంగా అయితే వారు సౌకర్యంగా ఫీల్ అవుతారో ఆలోచించండి. నేనిలా ఉంటాను, ఇలాగే మాట్లాడతాను అన్న మాటలు ఇక్కడ పనికిరావు.

ప్రేమ చూపించండి.

ఇది అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. కొంచెం ప్రేమ చూపించండి. ఒక్క చిన్న కౌగిలింత, ఒక ప్రేమ ముద్దు, ఒక ఆత్మీయ స్పర్శ.. ఇలా రకరకాలుగా మీ ప్రేమను చూపించవచ్చు. దీనివల్ల అవతలి వారిలో ఒక సౌకర్యం పెరిగి, ఆ అంశాన్ని వదిలేసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news