దళిత బంధును కచ్చితంగా అమలు చేసి తీరుతం- సీఎం కేసీఆర్

-

హుజూరాబాద్ ఎన్నికల తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ కేంద్రం తీరు, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. హూజూరాబాద్ లో దళితబంధును ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. నేను ఉన్నంత కాలం దళితబంధు అమలు చేస్తాం అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు దళితబంధును విస్తరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అన్నారు.kcr కేవలం ఒక్కసీటు గెలిచిందుకే బీజేపీ పార్టీ ఆగడం లేదని విమర్శించారు. ధాన్యం కొనకుండా కేంద్రం తన బాధ్యతలను విస్మరిస్తుందని అన్నారు. 2018లో 107 అసెంబ్లీల్లో డిపాజిట్ కోల్పోవడం మరిచిపోయారా..అని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ నేతలు అడ్డదిట్టంగా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడ్డందిడ్డంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అని తీవ్ర పదజాలంతో బీజేపీ నేతలను హెచ్చరించారు. ప్రాజెక్ట్ లలో అన్యాయం జరుగుతుందని విమర్శిస్తున్నారు… నిరూపిస్తారా.. కేసులు ఫైల్ చేస్తారా అని బీజేపీకి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news