విజయవాడలో కొడుకు.. భీమవరంలో అమ్మ, అమ్మమ్మ బలవన్మరణం

-

కరోనా వైద్యం కోసం చేసిన ఖర్చు అప్పుల పాలు చేసింది. ఆ అప్పులు కుటుంబం మొత్తాన్ని చిదిమేసింది. ఆర్థిక ఇబ్బందులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. భీమవరానికి చెందిన వెంకట కార్తీక్ అక్వేరియం వ్యాపారం చేస్తున్నాడు. ఆయన తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తల్లి ఇందిరా ప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారిలతో కలిసి వెంకట కార్తీక్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వ్యాపారం రీత్యా విజయవాడ వస్తూ ఉండే గత శనివారం లాడ్జీలో దిగాడు. ఆదివారం సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది తలుపు పగల గొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులు విషయం భీమవరంలోని కుటుంబ సభ్యులకు తెలిపారు.

వెంకట కార్తీక్ ఆత్మహత్య అమ్మ, అమ్మమ్మను కలచి వేసింది. తీవ్ర మనోవేదనకు గురైన వారు కూడా తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇందిరా ప్రియ, రాధాకృష్ణకుమారిలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్వేరియం వ్యాపారంలో వెంకట కార్తీక్ తీవ్రంగా నష్టపోయాడు. దీంతో బతుకుదెరువు కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ కొవిడ్ బారిన పడ్డారు. వైద్యం కోసం రూ.లక్షల ఖర్చు చేశారు. అప్పులు పెరిగిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వెంకట కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news