బ్రేకింగ్ : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

-

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం లో ఏకంగా 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాజ స్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌ పూర్‌ ప్రాంతంలో ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్‌ లోడ్‌ తో వెళుతున్న లారీని బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది.

అయితే.. ఘోర రోడ్డు ప్రమాదం లో ఏకంగా 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని… క్షత గాత్రులను స్థానిక ఆస్పత్రి కి తరలిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news