కరీంనగర్ జిల్లా : ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి గంగుల కమలాకర్.. మరోసారి బీజేపీ పై ఫైర్ అయ్యారు. బిజెపి పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తుందని.. కేంద్రములో ప్రభుత్వం నడిపే పార్టీ ఎన్ని తప్పులు చేస్తుందని మండిపడ్డారు. వానాకాలం పంట కొనను అని ఎవరు అన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంటాం అని చెప్పాము కొంటామని స్పష్టం చేశారు.
కొంటామంటే కొనమని ధర్నా చేయడం బీజేపీకే చెల్లిందని… వానాకాలం పంట ఎక్కడ కొనుగోలు జరగకున్నా నేను వెళ్లి కొనుగోలు చేపిస్తానని తేల్చి చెప్పారు. గతంలో 6వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు పెట్టామని… కానీ ఈ సారి 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని గుర్తు చేశారు. 3500 కొనుగోలు కేంద్రాలులో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని… ఇప్పటికే 5లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. 1000 కోట్ల ధాన్యం కొన్నామని… రైతులను మభ్యపెట్టేలా చేస్తున్న బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు ధర్నా చేసేది తప్పు అని… ఢిల్లీలో యాసంగి పై ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.