బండికి ఫుల్ సపోర్ట్..ఇక తగ్గేదేలే!

-

తెలంగాణ బీజేపీ దూకుడు రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌ని హుజూరాబాద్ ఉపఎన్నికలో చిత్తు చేసిన బీజేపీ..ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..ఇప్పటికే దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అయితే ఆయన్నే టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ రాజకీయం నడుపుతుంది. అసలు బండి అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీ పికప్ అయిందనే చెప్పాలి. గత బీజేపీ అధ్యక్షులకు భిన్నంగా బండి పనిచేస్తూ ముందుకెళుతున్నారు. పార్టీని పైకి లేపడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అలాగే బలమైన నాయకులని పార్టీలోకి తీసుకొచ్చి…టీఆర్ఎస్‌కు ధీటుగా పార్టీని నిలబెట్టడంలో సంజయ్ సఫలం అయ్యారు. ఇక దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అటు టీఆర్ఎస్‌పై గట్టిగానే పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. అందుకే కేసీఆర్ సైతం బండినే టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు. దూకుడుగా ఉన్న బండికి చెక్ పెట్టడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు.

అయితే కేసీఆర్ విమర్శలకు బీజేపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. సంజయ్‌కు సపోర్ట్‌గా ఉంటూ బీజేపీ బడా నేతలు సైతం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ సైతం…కేసీఆర్ కౌంటర్లకు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు. బండిని సపోర్ట్ చేస్తూ షెకావత్…కేసీఆర్ ట్రైబ్యునల్ జాప్యానికి ఎలా కారణమయ్యారో వివరించారు.

కేసీఆర్‌ వైఖరి వల్లే ట్రైబ్యునల్‌ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగిందని సంజయ్‌ ఇప్పటికే స్పష్టం చేయగా, ఇప్పుడు స్వయంగా కేంద్రమంత్రే ఆయన వ్యాఖ్యలను ధ్రువీకరించారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటిపంపకాల కోసం కేసీఆర్ కొత్త ట్రైబ్యునల్‌ అడిగారని, దాని ఏర్పాటుపై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, అసలు ట్రైబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణమని షెకావత్ చెప్పారు. అంటే షెకావత్ మాటలతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారు. అలాగే కేంద్ర పెద్దలు సపోర్ట్ బండికి దొరికింది. దీంతో కేసీఆర్, బీజేపీపై ఎలాంటి విమర్శలు చేసిన అడ్డంగా దొరికిపోయేలా ఉన్నారు. ఏదేమైనా కేసీఆర్‌పై పోరాటం చేసే విషయంలో బండి ఇంకా వెనక్కి తగ్గేలా లేరు.

Read more RELATED
Recommended to you

Latest news