కేర‌ళ లో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం

-

కేర‌ళ రాష్ట్రం పై వ‌రుస‌గా వైర‌స్ లు దాడి చేస్తున్నాయి. ఇప్ప‌టి కే క‌రోనా వైర‌స్ తో పాటు జికా వైర‌స్ కేర‌ళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించాయి. తాజాగా మ‌రొక వైర‌స్ కేర‌ళ రాష్ట్రం పై ప‌డింది. నోరో అనే వైర‌స్ ప్ర‌స్తుతం కేర‌ళ రాష్ట్రాన్ని వ‌ణికిస్తుంది. గ‌త రెండు వారాల నుంచి కేర‌ళ రాష్ట్రంలో ఈ వైర‌స్ వ్యాప్తి పెరుగుతుంది. ఇప్ప‌టికే కేర‌ళ రాష్ట్రం లో 13 మంది కి ఈ నోరో వైర‌స్ సోకింది.

ఈ నోరో వైర‌స్ సోకిన 13 మంది కూడా వ‌య‌నాడ్ జిల్లా లోని ఒక పశు వైద్య క‌ళాశాల విద్యార్థులు అని తెలుస్తుంది. కాగ ఈ నోరో అనే వైర‌స్ ఒక అంటు వ్యాధి ల వ్యాప్తి చెందుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి ఈ వైర‌స్ తో జాగ్ర‌త్త గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఎప్ప‌టి క‌ప్పుడు తాగు నీటి వ‌న‌రుల‌ను శుభ్రం చేసు కోవాల‌ని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువ గా ఉన్నా.. ప్ర‌మాదం ఎమీ కాద‌ని తెలుస్తుంది. ఈ నోరో వైరస్ సోకిన వారు వైద్యం తీసుకుంటే త‌గ్గి పోతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుత‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news