హుజూరాబాద్ ఎన్నికల తరువాత టీ కాంగ్రెస్ పరిస్థితి పెనం నుంచి పొయిలో పడ్డ చందంగా మారింది. పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతోంది. మరీ ఘోరంగా డిపాజిట్ రాకుండా కేవలం 1.4 ఓట్లకే పరిమితమై డిపాజిట్ కోల్పోవడం ఆపార్టీని మానిసికంగా దెబ్బతీసింది. దీంతో సీనియర్ల పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్మనాస్త్రాలు సంధిచారు. ఈనేపథ్యంలోనే ఇటీవల టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
తాజాగా నేడు టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితిపై హైకమాండ్ సీరియస్ గా ద్రుష్టిసారించింది. ముఖ్యంగా ఉప ఎన్నికలో పరాజయంపై చర్చ జరుగనుంది. ఓటమికి గల కారణాలు, నాయకుల సమన్వయ లోపం, ఎవరు సహకరించారు.. ఎవరు సహకరించలేదనే విషయాలను తెలుసుకోనున్నారు. అందుకే ఈనెల 13న ఏఐసీసీ టీ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రమ్మంది. పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, వీహెచ్‌లకు పిలుపు వచ్చింది. దీంతో నేతలందరూ ఢిల్లీకి పయనం అయ్యారు..