భారత్ వన్డే జట్టు కెప్టెన్ నుంచి విరాట్ కోహ్లీ వైదొలుగుతున్నట్టు సమాచారం. విరాట్ స్థానంలో టీమిండియా స్టార్ ఓపెనర్ , టీ ట్వంటి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. అయితే విరాట్ కోహ్లి పై ఉన్న భారాన్ని తగ్గించడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విరాట్ కోహ్లి ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమ్మన్ని ఇప్పటి కే కోరిందని తెలుస్తుంది. కెప్టెన్సీ ని పక్కన పెట్టి కేవలం ఆట పై దృష్టి సారించాలని విరాట్ కోహ్లి కి బీసీసీఐ సూచించినట్టు సమాచారం.
కాగ బీసీసీఐ ఒక అధికారి కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. అయితే వచ్చే ఏడాది జనవరి లో దక్షిణాఫ్రీకా సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ ముందే విరాట్ కోహ్లి ని తన కెప్టెన్సీ నుంచి తప్పుకొమ్మని బీసీసీఐ సూచించింది. దక్షిణాఫ్రీకా సిరీస్ నుంచి టీమిండియా కు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడని తెలుస్తుంది. కాగ ఇప్పటికే టీ ట్వంటి జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగాడు. ఆయన స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.