ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఏపీ ఈఆర్సీ అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేలు, సెప్టెంబర్ 2026 నాటికి వేయి మెగా వాట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేసేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. నెట్ వర్క్ ఛార్జెసు ను ప్రభుత్వం నుంచి క్లైమ్ చేసుకోవాల్సిందిగా ఏపీ ఈఆర్సీ సూచన లు చేసింది.