ఢిల్లీ కాలుష్యంపై కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం….

-

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లను దాటింది. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ ద్వాారా పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపటి నుంచి ఈనెల 17 వరకు నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ చర్యల వల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గే అవకాశం ఉండటంతో ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉంది.

మరోవైపు సుప్రీం కోర్ట్ కూడా ఈరోజు ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.  హర్యానా, పంజాబ్ రైతులు పంట వ్యర్థాలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 200 కు తగ్గేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలా అయితే లాక్ డౌన్ పై ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆదేవించింది ఉన్నత న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news