దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్రమశిక్షణ, నిబద్ధత కు మారు పేరని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నెల్లూరులో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… బిజెపి కార్యకర్తలు ఆయన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది చాలా ఉంది.. బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్రమంత్రి, ఉపరాష్ట్రపతి ఏ పదవిలో వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన నమ్మే విలువలె ఈస్థాయికి తీసుకువచ్చాయి..స్వర్ణభారత్ ఆలోచన ఆయన లోని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు. రైతులకు, పేదలకు, విద్యార్థులకు అండగా నిలుస్తున్న స్వర్ణభారత్ కి అభినందనలు తెలిపారు. సేవ చేసే అవకాశం కొందరికే వస్తుంది..స్వర్ణభారత్ సేవలు చిరస్మరణీయంగా నిలోచిపోతాయన్నారు..