మహరాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ పై 400 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బీద్ జిల్లాలోని అంబజోగైలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం యువతి తల్లి మరణించడంతో తండ్రి ఆమెకు వివాహం చేశారు. అయితే పెళ్లి తరవాత మామ వేధింపులు మొదలయ్యాయి. దాంతో పుట్టింటికి వచ్చేసింది. అనంతరం అంబజోగైలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాగా ఓ అకాడమీలో ఇద్దరు వ్యక్తులను యువతి సంప్రదించింది. ఆ ఇద్దరూ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తరవాత మొత్తం 400 మంది మైనర్ పై అత్యాచారం చేశారు. ఇక న్యాయం కోసం పోలస్ స్టేషన్ కు వెళ్లగా ఓ పోలీస్ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. న్యాయం చేస్తానంటూ చెప్పి లాడ్జ్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ కేసు శిశు సంక్షేమశాఖ వరకూ చేరింది. దాంతో ఏస్పీ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే 9మంది నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు ప్రస్తుతం బాలిక గర్భవతిగా నిర్ధారణ కావడంతో శిశు సంక్షేమ శాఖ గర్భవిచ్చిత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.