సిఎం జగన్‌ కాన్వాయ్‌ వెనుక పరుగెత్తిన మహిళ.. ఆపి మరీ !

-

ఇవాళ తిరుపతిలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి… అమిత్ షా హజరు కాగా.. కర్ణాటక సీఎం బమ్మై తెలంగాణ రాష్ట్రం తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందు ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ కాన్వాయ్ వెనుక ఓ మహిళ పరిగెత్తడం స్థానికంగా కలకలం రేపింది.

తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి రోడ్డు మార్గాన బయలు దేరింది ముఖ్యమంత్రి కాన్వాయ్. అయితే..ఈ సందర్భంగా ఓ మహిళ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనుక పరుగెత్తింది. డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓ వినతి పత్రం పట్టుకొని.. కాన్వాయి వెనుక పరుగెత్తింది ఆ మహిళ. అయితే ఆమెను చూసి.. సిఎం జగన్ కాన్వాయ్ ని ఆపమని ఆదేశించారు. కాన్వాయ్ లో ఉన్న ఓఎస్డి ధనంజయ రెడ్డిని మహిళ వద్దకు పంపి వినతి పత్రాలను స్వీకరించారు సిఎం జగన్. అంతే ఆ డిమాండ్లను నెరవేర్చుతానంటూ.. హామీ ఇచ్చారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news