కలెక్టర్లు కూడా రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు – రేవంత్ రెడ్డి.

-

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. ప్రజా చైతన్య యాత్రలను వాయిదా వేశామని.. రద్దు చేయలేదని తెలిపారు. కలెక్టర్లు కూడా రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రజా చైతన్య యాత్ర కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల పేరుతో అనుమతించడం లేదు. కానీ టీఆర్ఎస్, బీజేపీలకు అనుమతులు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఒక్క కేసుకూడా నమోదవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్లి, ప్రజా సమస్యలను తెలుసుకునేందకు పాదయాత్రలు చేస్తామంటే ఎన్నికల నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిబంధనలు కాంగ్రెస్ పార్టీకేనా..? టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల కొనుగోలు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. మిల్లర్లు, దళారులతో కుమ్మక్కు అయి రైతుల్ని నిండా ముంచుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల పొట్టగొడుతున్నారన్నారు. వరి కుప్పల మీద రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని… పది పదిహేను రోజులు చూసి రైతులు తక్కువ ధరకే దళారులకు, మిల్లర్లకు ధాన్యం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news