టీ ట్వంటి ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ కప్ గెలిచినందుకు ఆసీస్ కు ఫ్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు.. అనే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమాని ని వేధిస్తుంది. అయితే ఈ టోర్ని కప్ కొట్టిన ఆసీస్ కు రన్నరప్ గా ఉన్న న్యూజిలాండ్ కు ఎంత ఫ్రైజ్ మనీ ఇస్తున్నారో చూద్దం. అలాగే సెమీ ఫైనల్ కు వచ్చిన జట్లు కు ఎంత ఫ్రైజ్ మనీ ఇస్తున్నారో తెలుసుకుందాం.
ఈ మెగా టోర్నీ కి మొత్తం ఫ్రైజ్ మనీ 5.6 మిలియన్ డాలర్లు అంటే రూ. 42 కోట్లు. అందులో ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ కు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు). ఇచ్చారు. అలాగే సూపర్ -12 లో 5 మ్యాచ్ లకు 5 గెలిచిన ఆసీస్ కు అధనం గా మరో రూ. 1.2 కోట్ల ను అందజేశారు. దీంతో ఆసీస్ కు మొత్తం రూ. 13.1 కోట్లు ముట్టింది. రన్నరప్ ఉన్న న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు). అలాగే సూపర్ 12 లో 4 మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌కు అధనంగా రూ.1.2 కోట్లు ఇచ్చారు.
అలాగే సెమీస్ చేరిన జట్లల్లో పాకిస్థాన్ కు రూ. 3 కోట్లు , ఇంగ్లాండ్ కు రూ. 3 కోట్లు అందాయి. అలాగే సూపర్ -12 లో 5 మ్యాచ్ లు గెలిచిన పాక్ కూడా అధనం గా ఫ్రైజ్ మనీ ఇచ్చింది. దీంతో పాక్ కు మొత్తం రూ. 4.5 కోట్లు ముట్టింది. అలాగే 4 మ్యాచ్ లు గెలియిన ఇంగ్లాండ్ కు కూడా అధనంగా ఇచ్చిన వాటితో 4.2 కోట్ల రూపాయలు వచ్చాయి.