తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రద్దు చేసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించాలని నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇలాంటి సమయంలో తన పర్యటన వల్ల ఇంకా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని… గ్రహించారు చంద్రబాబు నాయుడు. ఈ తరుణంలోనే ఇవాల్టి కుప్పం పర్యటన వాయిదా వేసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు తాను రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ గెలుపు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లు పడకుండా చూడాలని పేర్కొన్నారు. కాగా కుప్పంలోని 16వ వార్డులో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమను పోలింగ్ బూత్ నుంచి తరిమేస్తున్నారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టిడిపి అభ్యర్థి, జనరల్ ఏజెంట్. 16వ వార్డు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దోంగ ఓట్లయ వేయడానికి వచ్చిన యాబైమంది పైగా పట్టుకున్నారు పోలీసులు…