తగ్గేదేలే… ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నిన్న చెప్పినట్లు గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐ కి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. 2020 – 21 రబీ లో భాగంగా మిగిలిన ధానం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇవాళ రాసిన లేఖ లో ప్రధాని నరేంద్ర మోడీని విజ్ఙప్తి చేశారు.

KCR and Modi

రబీ సీజన్‌ లో మిగిలిన ఏకంగా 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు సీఎం కేసీఆర్‌. 2021 – 22 ఖరీఫ్‌ లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోనుగోలు చేయాలని లేఖలో కోరారు కేసీఆర్‌. వచ్చే రబీ సీజన్‌ లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యాన్ని కొంటుందో తెలపాలని డిమాండ్‌ చేశారు కేసీఆర్‌. దాని ప్రకారం తెలంగాణ రైతులకు తాము ఆదేశాలు ఇచ్చుకుంటామని తేల్చి చెప్పారు కేసీఆర్‌. దీనిపై తొందరగా క్లారిటీ ఇస్తే… బాగుంటుందని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news