తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రూపొందిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదికపై ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరు సీఎం అయినా పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం ఫైళ్లపైనే సంతకం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బాధ్యతను నేనే తీసుకుంటా .. అని బండి సంజయ్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో వేదికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉన్నారు.
తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది బీజేపే అని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే నెల 17 నుంచి 21 వరకు ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అపాయింట్మెంట్ లేకుండా సీఎం ఢిల్లీకి వెళ్లారని.. ఆయన సొంత పనుల కోసమే ఢిల్లీ టూరంటూ విమర్శించారు.