ఏపీకి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావారణ శాఖ పేర్కొంది. కోమరిన్ ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నదని వెల్లడించింది వాతావారణ శాఖ. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో సుమారు నవంబర్ 29 , 2021 వ తేదీకల్లా ఏర్పడవచ్చును ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి , పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిం చే అవకాశం ఉందని తెలిపింది వాతావారణ శాఖ.
వీటి ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని.. రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమలోరెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావారణ శాఖ పేర్కొంది.