మూడు వ్యవసాయ చట్టాలపై గతేడాది నవంబర్ నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. దీని ఫలితంగానే మోడీ ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామన్నారు… పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే చట్టాలను పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నారు. అయితే రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణించినట్లు రైతు సంఘాలు అంటున్నాయి. వీరందరికీ రూ. 25 లక్షల పరిహారాన్ని కేంద్రం ఇవ్వాలని రైతుల సంఘాలతో పాటు విపక్షాలు కోరుతున్నాయి.
తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల మరణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో రైతులు మరణించ లేదని స్పష్టం చేస్తూ ప్రకటన చేశారు. రైతులు మరణించినట్లుగా తమ వద్ద రికార్డులు లేవని పార్లమెంట్ లో తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పరిహారం చెల్లించేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి తోమర్.
ఇటీవల రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మందికి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనపై రైతు సంఘాల ఎలా స్పందిస్తాయో చూడాలి.