ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం మరియు దీనికి అను బంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం ,మధ్య ట్రోపో స్పియర్ వరకు విస్తరించి ఉన్నది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రేపు అనగా డిసెంబర్ 2వ తేదీ కల్లా వాయుగుండముగా బలపడుతుంది.
ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తంలో తుపాన్ గా మారుతుంది. ఇది తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిస్సా తీరమునకు డిసెంబర్ 4వ తేదీ కల్లా చేరవచ్చునని తెలిపింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ స్పష్టం చేసింది. ముఖ్యంగా…. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని జిల్లాల్లో ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.