వైద్యాధికారి కుటుంబంలో 6గురికి కరోనా… ఓమిక్రాన్ నేపథ్యంలో భయాందోళన

-

రాష్ట్రంలో ఓమిక్రాన్ ధడ మొదలైంది. నిన్న బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ఆమె శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్  కోసం ల్యాబ్ కు పంపారు. దీంతోొ తెలంగాణలో కలవరం మొదలైంది. మరోవైపు సూర్యాపేట డీఎంహెచ్ఓ కుటుంబంలో ఆయనతో పాటు 6 మందికి కరోనా రావడం ఇప్పుడు కలకలం కలిగిస్తోంది.

సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ కోటాచలం కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఇటీవల జర్మనీ నుంచి 5 రోజుల క్రితం సదరు వైద్యాధికారి కొడుకు రావడం.. ఆ తరువాత ఒక్కొక్కరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కొడుకు, కోడలు, భార్యతో పాటు మరో ఇద్దరికి కూడా కరోనా సోకింది. అయితే జర్మనీలో ఓమిక్రాన్ కేసులు పెరగడం.. అక్కడ నుంచి ఆయన కుమారుడు రావడం ఓమిక్రాన్ అనుమానాలను పెంచుతోంది. ఇటీవల ఆయన కుటుంబం తిరుపతి వెళ్లడం.. ఆతరువాత కోటాచలం ఏయిడ్స్ డే కార్యక్రమాల్లో పాల్గొనడంతో భయాందోళనలను మరింత పెంచుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news