వేరుశనగ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వేరుశనగ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆకలేసినప్పుడు గుప్పెడు పల్లీలు తింటే కడుపు నిండిపోతుంది. అయితే ఆరోగ్యానికి పల్లీలు ఎలా మేలు చేస్తాయి..? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి:
పల్లీలలో ఐరన్ మరియు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ లో ఆక్సిజన్ చేరేటట్లు చూస్తుంది. అలానే ఎముకలని కూడా దృఢంగా ఉంచుతుంది.
డయాబెటిస్ సమస్య తగ్గుతుంది:
డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు వేరుశనగ తీసుకోవడం వల్ల డయాబెటిస్ యొక్క రిస్క్ 21 శాతం తగ్గుతుంది అని స్టడీ చెబుతోంది.
డిప్రెషన్ సమస్య ఉండదు:
డిప్రెషన్ ను తగ్గించడానికి కూడా వేరుశనగ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెదడుని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వేరుశనగ. అలానే ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇలా పల్లీలు తీసుకుని హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అజీర్తి సమస్యలు ఉండవు:
వేరుశనగ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. కాన్స్టిపేషన్, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వేరుశెనగ తో తరిమికొట్టొచ్చు. అలానే ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని అందంగా ముసలితనం రాకుండా చూసుకుంటుంది. చూసారు కదా పల్లీలని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది. కాబట్టి రెగ్యులర్ గా వీటిని తీసుకొని ఈ సమస్యల నుండి దూరంగా ఉండండి.