ప్రతీ ముగ్గురితో ఒకరికి మాస్క్ ఉండటం లేదు.. తాజా సర్వేలో వెల్లడి..

-

కరోనా రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చకుంటూ ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. మనం తీసుకునే స్వీయ నిబంధనలే కరోనా నుంచి కాపాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడంతో పాటు.. భౌతిక దూరం పాటించడం.. మాస్కులను ఎప్పటికి వాడటం వంటివి చేస్తే కరోనా బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుందని చెబుతున్నారు. మాస్కులు జేబులో ఉండే వ్యాక్సిన్ల వంటివని వైద్యులు అంటున్నారు.

అయితే కొంత మంది మాత్రం ఎంత చెప్పినా.. మాస్కులు పెట్టుకోవడం లేదు. దీంతో వారే కాకుండా, పక్కవారిని కూడా కరోనా మహమ్మారికి దగ్గర చేస్తున్నారు. తాజాగా ఓ నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ప్రతీ ముగ్గురిలో ఒకరు మాస్కు పెట్టుకోవడం లేదని తేలింది. మాస్కులు పెట్టుకోకుండానే బయటకు వెళ్తున్నారని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇప్పటికే మన దేశంలో ఓమిక్రాన్ ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకుంటే.. ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news