#PushpaTrailer : పుష్ప ట్రైలర్.. సారీ అంత‌రాయానికి చింతిస్తున్నాం

-

పుష్ప సినిమా ఫ్యాన్స్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైల‌ర్ ను ఇవాళ సాయంత్రం 06.30 గంట‌ల‌కు విడుద‌ల చేయాల‌ని పుష్ప టీం మొద‌టగా ప్ర‌క‌టించింది. దీంతో అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ఎదురు చూశారు. అయితే.. కొన్ని సాంకేతిక కార‌ణంగా వ‌ల్ల పుష్ప సినిమా ట్రైల‌ర్ ను వాయిదా వేస్తున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

దీనిపై తాము చింతిస్తున్నామ‌ని… అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నామ‌ని ట్వీట్ చేసింది చిత్ర బృందం. దీంతో పుష్ప అభిమానులు నిరాశ కు గుర‌య్యారు. అతి త్వ‌ర‌లోనే పుష్ప టైల‌ర్ అప్డేట్ ను ఇస్తామ‌ని చిత్ర బృందం పేర్కొంది. కాగా… పుష్ప సినిమాను రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. స‌క్సెస్ పుల్ మూవీ మేక‌ర్స్ కి కేరాఫ్ గా ఉండే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news