కుప్పం ఓటమిపై చంద్రబాబు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

-

నేడు కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వ‌హించనున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలు పోటములపై అభ్యర్థులు, నేతలతో ఇవాళ‌ మాట్లాడనున్నారు చంద్రబాబు.
దీంతో కుప్పం ఫలితాల సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెల‌కొంది. కుప్పంలో ఓటమికి చంద్రబాబు ఎవర్ని తప్పు పడతారోనని పార్టీ వర్గాల్లో చర్చ జ‌రుగ‌నుంది.

chandrababu naidu

కుప్పంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం చాలా కాలంగా ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తోన్న నేతల వైఖరిని తప్పు పడుతోన్నారు కుప్పం కార్యకర్తలు. కుప్పంలో స్థానిక నాయకత్వాన్ని వేరే వారికి అప్పగించే అంశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కొత్తవారికి కుప్పం బాధ్యతలు అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కుప్పం స్థానిక నాయకత్వంలో టీడీపీలో సమూల మార్పు కోరుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. కడప జిల్లా రాజంపేట మునిసిపల్ ఎన్నికల పైనా కూడా ఇవాళ‌ సమీక్షించనున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. కాగా.. కుప్పం మున్సిప‌ల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్త‌గా ఓడిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news