కేంద్ర హోం శాఖ మంత్రి,బీజేపీ పార్టీ అగ్ర నేత అమిత్ షా ఆఫీస్ నుంచి…తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ వచ్చింది. రేపు (09.12.2021 గురువారం) అందుబాటు లో ఉండాలని బండి సంజయ్ కుమార్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ నేపథ్యంలోనే.. అమిత్ షా కార్యలయం నుంచి బండి సంజయ్ కి ఫోన్ కాల్ వచ్చింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో సహా 4 గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు లను అమిత్ షా తో భేటీకి రేపు తీసుకెళ్లనున్నారు రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయం లో స్టేట్ గవర్నమెంట్ వైఖరి పై అమిత్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి కొనుగోలు పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అమిత్ షా చర్చించే ఛాన్స్ ఉంది.