రేపే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. స‌ర్వం సిద్దం చేసిన ఈసీ

-

తెలంగాణ లో రేపు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిలు జ‌ర‌గ‌నున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తం గా ఐదు జిల్లా లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా జిల్లా లో మొత్తం 37 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశార‌ని.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ‌శాంక్ గోయాలు తెలిపారు.

అలాగే ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 5326 ఓట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు, అధికారులు కోవిడ్ 19 గైడ్ లైన్స్ ను త‌ప్ప‌క పాటించాలని సూచించారు. అలాగే ఓట‌ర్ల ను క్యాంపు ల‌లో కి త‌ర‌లించార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని అన్నారు. వాటిపై విచార‌ణ చేపిస్తామ‌ని తెలిపారు. అలాగే ఈ జిల్లా లో మొత్తం ఎక్స్ అఫిషియో 65 ఓట్లు ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news