కేరళ రాష్ట్రంలో బర్డ ఫ్లూ వైరస్ మరో సారి పంజా విసురుతుంది. ఇప్పటి కే పలు సార్లు కేరళ రాష్ట్రం లో బర్డ్ ఫ్లూ వైరస్ అలజడి సృష్టించింది. తాజా గా మరో సారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఇప్పటి కే దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులు.. అలగే కొత్త గా వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ తో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. ఈ వైరస్ రావడం తోమరింత భయపడుతున్నారు. కేరళ రాష్ట్రం లో ని అలప్పుళ జిల్లా లోని తకాళి లో ఈ వైరస్ ను వైద్య అధికారులు గుర్తించారు.
వైరస్ ను గుర్తించిన కిలో మీటర్ల చుట్టూ కోళ్లను, బాతుల తో పాటు ఇతర పెంపుడు పక్షులను చంపాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మాంసం అమ్మకాల పై నిషేధం విధించారు. అలప్పల్ లో దాదాపు 12 పంచాయితీల్లో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు రకాలైన ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి ని అడ్డు కోవడానికి ప్రయత్నిస్తున్నారు.