భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎక్కడెక్కడ చెల్లితుందో తెలుసా..?

-

వెహికిల్ ఏదైనా నడపాలంటే తప్పకుండ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉన్నవాళ్లు ఆ లైసెన్స్ ను ఇతర దేశాల్లో కూడా చెల్లుబాటు చేసుకునే అవకాశం వుంది. అయితే మరి మన దేశంలో వుండే లైసెన్స్ ఎక్కడెక్కడ చెల్లుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

మన దేశంలో ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ న్యూజిలాండ్ లో చెల్లుతుంది. న్యూజిలాండ్ లో స్టే చెయ్యడానికి వెళ్లిన వాళ్ళు ఇండియా లైసెన్స్ తో సంవత్సరం పాటు వాహనాలను నడపవచ్చు. అయితే ఏ వాహనం మంజూరు అయిందో ఆ వాహనాన్ని మాత్రమే నడపాలి. అలా ఫాలో అవ్వకపోతే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అలానే హాంగ్ కాంగ్ లో కూడా లైసెన్స్ కి అనుమతి ఉంటుంది. టూర్ ను ఎక్కువరోజులు ప్లాన్ చేసుకునే వాళ్లు వాహనాలను అద్దెకు తీసుకుని ఇండియన్ లైసెన్స్ తో నడపచ్చు. అంతే కాదు భారత డ్రైవింగ్ లైసెన్స్ సింగపూర్ లో సంవత్సరం పాటు పని చేస్తుంది. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం ఆ దేశం మొత్తాన్ని చూసొచ్చేయచ్చు.

మలేషియా లో నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉండాలి. దక్షిణాఫ్రికాలో లైసెన్స్ పై ఫోటో, సంతకంతో పాటు లైసెన్స్ కాపీ ఇంగ్లీష్ లో ఉండాలి. స్విట్జర్లాండ్ లో ఇంగ్లీష్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు వాహనం నడుపుకునే అవకాశం వుంది. అలానే ఆస్ట్రేలియాలో కూడా మన దేశ లైసెన్స్ కు అనుమతి ఉంటుంది. బ్రిటన్, స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌, వేల్స్‌ దేశాలలో ఏడాదిపాటు మన దేశ లైసెన్స్ చెల్లుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news