న్యూఢిల్లీలో రెండో కేసు.. కనిపించని లక్షణాలు

-

జింబాబ్వే నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి శనివారం ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ వ్యక్తికి ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని, నీరసంగా ఉన్నట్లు పేర్కొన్నట్లు లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. జింబాబ్వే ప్రయాణికుడికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో ఢిల్లీలో కొత్త వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య రెండింటికి చేరుకున్నది.

శనివారం ఉదయం 10 మందికి సంబంధించిన జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వచ్చాయి. 35ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చాడు. అతను సౌతాఫ్రికా కూడా వెళ్లినట్లు తెలిసింది. డిసెంబర్ 5న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ బాధితులను ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news