“అఖండ” చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు : కన్నబాబు

-

అఖండ సినిమా చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారని.. చంద్రబాబు చూడాల్సింది జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో అంటూ చురకలు అంటించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా ? అని నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో టీడీపీ స్కిల్ తో చేసిన స్కాంను బయట పెట్టాల్సి న బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందన్నారు.

స్ట్రా వేసి తమ ఐదేళ్ళ కాలంలో ఎంతో లూటీ చేశారో ? విభజన హామీలు ఏమయ్యాయని అడగటానికి చంద్రబాబు సిగ్గుందా ? అని ఫైర్ అయ్యారు. ప్యాకేజీ చాలు హోదా వద్దు అని సంబరాలు చేసుకుంది చంద్రబాబు కాదా ? అని చురకలు అంటించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్పీలు రాజీనామా చేసినప్పుడు టీడీపీ ఎమ్పీలు ఎందుకు రాజీనామా చేయలేదని ఫైర్ అయ్యారు.

అధికారంలో ఉంటే బీజేపీ భజన… ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్ర విభజన అంటూ ఎద్దేవా చేశారు. 30వేల ఎకరాల ఆస్తి కోసం అమరావతి పేరుతో ఉద్యమమని.. ఏపీకి ప్యాకేజీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేసిన విషయం మర్చిపోయారా ? అని నిలదీశారు. ఇప్పుడు సుభాషితాలు, ప్రవచనాలు చేస్తారా?? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news