ధాన్యం కొనుగోలుపై రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

-

ధాన్యం కొనుగోలుపై జగన్ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నేరుగా ఆర్బీకేలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ పంటలు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. వర్షాల వల్ల ధాన్యం లో తేమ శాతం పెరుగుతుందని..
దీంతో ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందు కు రావటం లేదన్నారు.

ఇప్పటికే 2,30,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. ప్రతి ఆర్బీకేను మిల్లులతో అనుసంధానం చేశామని వెల్లడించారు. ఎక్కువగా తడిసిన ధాన్యం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసి అక్కడ ధాన్యం కొనుగోలు పై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపు పై కేంద్రానికి అనుమతి కోసం లేఖ రాశామని వెల్లడించారు.

తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రైతాంగం గురించి ఒక్కసారైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. భయాందోళనలకు గురి చేసి రైతులు ఎంతోకొంతకు ధాన్యం అమ్ముకుని నష్టపోవాలని చూస్తున్నారని చంద్రబాబు పై నిప్పులు చెరిగారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.

Read more RELATED
Recommended to you

Latest news