రజినీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సెలబ్రెటీలు..

-

సూపర్ స్టార్ రజినీ కాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.. రజినీకాంత్ ఈ రోజు తన 72 ఏట అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెప్పారు.

’’రజనీకాంత్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తన సృజనాత్మకత మరియు అద్భుతమైన నటనతో ప్రజలను స్పూర్తిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. సర్వశక్తిమంతుడు అతనికి దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించుగాక” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా తమిళ సినిమా సూపర్ స్టార్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు . 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్‌కు మరికొన్నాళ్లు తన సాటిలేని స్క్రీన్ ప్రెజెన్స్‌తో తమిళ ప్రజలను అలరించాలని కోరుకుంటున్నట్లు స్టాలిన్ తమిళంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“హ్యాపీ బర్త్ డే మై తలైవా!! ది వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ రజినీకాంత్ సార్.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.” అంటూ ధనుష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సచిన్ ట్విట్టర్ లో “హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్ సర్. మీ మంచి ఆరోగ్యం మరియు జీవితంలో సంతోషం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను.” అంటూ విషెస్ తెలిపారు.

మలయాళ సినీ ప్రముఖులలో ఒకరైన మోహన్‌లాల్, “ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.. మీరు వినయానికి ప్రతిరూపం. మీ మంచి ఆరోగ్యం మరియు ఆనందం కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news