విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ దీక్ష చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వైసీపీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ” మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ల తరఫున నిలబడతాం. లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను ఏమి చేయలేను. నా సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని వైసీపీ నేతలు చూశారు. నా సినిమాలను ఆపితే నేను భయపడను. పంతానికి దిగితే నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా” అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలని.. ప్రైవేటీకరణను ఆపడం మా చేతుల్లో లేదని చెబుతోన్న వైసీపీ.. కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ఆపుతామని ఎందుకు ప్రచారం చేసింది..? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణను ఆపుతామనే అజెండాతో కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓట్లు ఎందుకు వేయించుకున్నారు..? అని.. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే ఇక్కడ దీక్ష ఎందుకు అని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహనీయుడేనని వైసీపీకి గుర్తులేదా..?. అని నిలదీశారు.