‘మా’ ఎన్నికలు.. మళ్లీ వేడెక్కిన టాలీవుడ్..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు మార్చి 10న జరుగనున్నాయి. మా అధ్యక్షుడి పోటీలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు శివాజి రాజా, సీనియర్ హీరో నరేష్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు సినిమా పరిశ్రమలో మంచి సత్సంబంధాలు ఉన్నవారే. అయితే శివాజి రాజాకు వ్యతిరేకంగా మాజి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్ నరేష్ కు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఎలాగు నరేష్ కు సూపర్ స్టార్ మహేష్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. శివాజి రాజాకి మెగా సపోర్ట్ ఉంది. శ్రీకాంత్ ఫుల్ సపోర్ట్ శివాజి రాజాకే.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారే. ఇదవరకు ఏకగ్రావంగా ఎన్నుకునే మా అధ్యక్ష పదవికి గత రెండు సంవత్సరాలుగా పోటీ ఏర్పడింది. ఎన్నిక వరకు పోటీ ఉండి ఆ తర్వాత అంతా సెట్ రైట్ అయితే బెటరే.. కాని తాము సపోర్ట్ చేసిన వ్యక్తికి అధ్యక్ష పదవి రాలేదని హీరోలు అసోషియేషన్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మార్చి 10న శివాజి రాజా, నరేష్ వీరిద్దరిలో ఎవరు మా కొత్త అధ్యక్షుడు అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news