సానియా మీర్జాపై మ‌ళ్లీ నెటిజ‌న్ల ఫైర్‌.. ఎందుకంటే..?

-

సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ను పాకిస్థాన్ ఆర్మీ ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. వాఘా సరిహ‌ద్దు వ‌ర‌కు అభినంద‌న్‌ను పాక్ ఆర్మీ ర‌హ‌దారి మార్గంలో త‌ర‌లించి స‌రిహ‌ద్దు వ‌ద్ద భారత సైన్యానికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో అభినంద‌న్ రాక‌పై యావ‌త్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ముక్త కంఠంతో జైహింద్ అని కొనియాడారు. అలాగే ఇండియ‌న్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభినంద‌న్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

‘వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌కు స్వాగ‌తం. నువ్వు మా నిజ‌మైన హీరోవి. మీరు చూపిన తెగువ‌, ధైర్య సాహసాల‌కు యావ‌త్ దేశం మీకు శాల్యూట్ చేస్తుంది. మ‌రోసారి అభినంద‌న్‌కు స్వాగ‌తం చెబుతున్నా. జై హింద్‌..!’ అంటూ.. సానియా ట్వీట్ చేసింది. అయితే సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. సానియా పెట్టిన ట్వీట్‌పై వారు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

‘నీకు నిజ‌మైన హీరో ఎవ‌రో ఇప్పుడు తెలిసిందా..’ అని కొంద‌రు సానియా ట్వీట్‌ను విమర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు.. ‘నువ్వు నిజ‌మైన హీరోను ఇప్ప‌టి వ‌ర‌కు చూసుండ‌వు..’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభినంద‌న్ పాక్ ఆర్మీ అదుపులో ఉన్న‌ప్పుడు కూడా సానియా చేసిన ట్వీట్‌పై దుమారం చెల‌రేగిన విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఆమె భ‌ర్త, పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ మాత్రం త‌మ దేశ ఆర్మీకి అనుకూలంగా గ‌తంలో కామెంట్లు చేశాడు. అందువ‌ల్లే.. భార‌త పౌరులు సానియా ట్వీట్ల‌పై మండిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news