హుజూరాబాద్ ఓటమి తర్వాత … కేసీఆర్ ధాన్యం అంశాన్ని ఎత్తుకున్నారు.- కిషన్ రెడ్డి.

-

వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని ఎత్తుకున్నారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా.. అని ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. సీఎం మెడమీద కత్తి పెట్టి రాయించున్నారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పిదాల నుంచి కప్పి పుచ్చుకోవడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

గతంలో తెలంగాణకు నాలుగు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా.. ధాన్యాన్ని సేకరించలేదని అన్నారు కిషన్ రెడ్డి. మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని నిలదీశారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసింది మీరు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన మొదట్లో రూ. 3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుతం.. రూ. 26,600 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news