ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. లాక్ డౌన్ తప్పదా !

-

మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసుతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రా న్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో 800 కు చేరువలో ఒమిక్రా న్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరుకానున్నారు.

ముఖ్యంగా ఈ సమావేశానికి వైద్య శాఖకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. ఒమిక్రా న్ తో పాటు వచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది.

గత గురువారం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు. ఇక ఇవాళ కూడా కొత్త వేరియంట్ తో పాటు ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోడీ మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అలాగే లాక్ డౌన్ విధిస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే దానిపై కూడా చర్చ జరిగే ఛాన్సుంది.

Read more RELATED
Recommended to you

Latest news