జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలీదు : బీజేపీ నేత సంచలనం

-

జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలీదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బిజేపి ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలీదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు.

మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా దోచేస్తున్నారన్నదే మా అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవేదన అని… కొందరు పెడార్ధాలు తీసి దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు.

ట్వీట్లు చేసే వ్యక్తులకు తగ్గించమనే సత్తా వుందా… అని ప్రశ్నించారు. మద్యం అలవాటు వున్న ఒక సగటు వ్యక్తి నుంచి ఏడాదికి 80 వేల రూ..అదనంగా దోచేస్తున్నారని.. సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గిస్తారు…. మద్యం రేట్లు పది రెట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్ళుగా రాక్షస పాలన కొనసాగుతుంది.. ఇదే దోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 17 సీట్లు కూడా రావని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news