సామాన్యులకు కొత్త సంవత్సరం లో నెత్తిన మరో బండ పడింది. ఇప్పటికే పెట్రోల్, డిజిల్ తో పాటు నిత్యవసర సరుకులు, కూరగాయాల ధరలు విపరీతం గా పెరిగిపోతున్నాయి. వీటిని తట్టుకోలేక అప్పులు చేస్తున్న సామాన్యులకు మరో షాక్. నేటి తెలంగాణ రాష్ట్రంలో పాల ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లీటర్ పాల పై రూ. 2 పెరిగింది. హోల్ మిల్క్ పై రూ. 4 పెరిగింది. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమలు కానున్నాయి.
పెరిగిన ధరలతో పాలు మార్కెట్ లో డబుల్ టోన్డ్ రకం పాలు 200 మి. లీ కు రూ. 9 నుంచి రూ. 9.5 కి పెంచారు. అలాగే 300 మి. లీ రూ. 14 నుంచి 15 కు పెరిగింది. దీంతో పాటు 500 మి. లీ ధర రూ. 22 నుంచి 23 కు పెరిగింది. వీటితో పాటు స్టాండర్ డైజ్డ్ పాలు 500 మి. లీ రూ. 26 నుంచి రూ. 27 కు పెరిగింది. హోల్ మిల్క్ 500 మి. లీ ధర రూ. 31 నుంచి 33 కు పెంచారు. వీటితో పాటు ఆవు పాలు 500 మి. లీ ధర రూ. 24 నుంచి రూ. 25 కు పెరిగింది. అలాగే లీటర్ పాల ధర 47 నుంచి రూ. 49 కి పెరిగింది.