తెలంగాణ బిజెపి ఎంపీలు శిఖండిలు అని రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతు బంధు ద్వారా ఒక్క అప్లికేషను లేకుండా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ అయ్యాయని… తెలిపారు. ఈ సందర్భంగా కరోనా ప్రోటోకాల్ కు లోబడి సంబరాలు చేసుకోవలని పిలుపు ఇచ్చామని… వెల్లడించారు. రైతు బంధు వల్ల సోమరిపోతులు అవుతారని బిజెపి బండి సంజయ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు…దానిని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
రైతులను కించపరిచేలా బండి సంజయ్ మాట్లాడారు…మరి పీఎం కిసాన్ కింద ఎందుకు ఇస్తున్నారు ? అని నిలదీశారు. తెలంగాణ బిజెపి ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని… ఆంధ్ర నేతలు పెట్టుకొన్న వ్యాపారం ‘ స్వరాజ్య వేదిక ‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లేని రైతు ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని… ఈ వానాకాలం 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన, తప్పుడు ప్రచారం చేసిన చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.