టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..షర్మిల పార్టీలో చేరిన గట్టు రామచంద్ర రావు

-

టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు గట్టు రామచంద్ర రావు. ఇవాళ వైఎస్‌ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు గట్టు రామచంద్ర రావు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన… షర్మిల పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ… తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని… టీఆరెఎస్ కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని చెప్పారు.

షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్ లు చేయడం లేదని… తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా షర్మిల కనిపిస్తోందని… మహిళలకు ప్రాధాన్యత షర్మిల పార్టీలో పెరుగుతోందని చెప్పారు. బండి సంజయ్ ను రాజకీయంగా కేసీఆర్ ఎందుకు హైలెట్ చేస్తున్నారని.. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ తపన పడుతున్నారని నిప్పులు చెరిగారు. అందుకే తెలంగాణలో బీజేపీ నీ కేసీఆర్ హైలెట్ చేస్తున్నారని… రానున్న రోజుల్లో బీజేపీ.. కేసీఆర్ కలిసి పని చేస్తారని సంచలన ఆరోపణలు చేశారు గట్టు రామచంద్ర రావు.

Read more RELATED
Recommended to you

Latest news