జగన్‌ బిగ్‌ షాక్‌..ఏపీలో పార్టీ పెట్టడంపై షర్మిల సంచలన నిర్ణయం !

-

ఏపీలో పార్టీ పెట్టడంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెడుతున్నారా అని అడిగిన అంశం పై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిల… రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని స్పష్టం చేశారు. పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని… మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని ప్రకటన చేశారు వైఎస్‌ షర్మిల. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నహాలు చేస్తున్నామని.. రైతు ఆవేదన యాత్రకి అనుమతి లేదు అంటున్నారని పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.

నిబంధనల ప్రకారం పోతాము అని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదు అంటున్నారన్నారు. రైతు బందు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని.. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. బీజేపీ, కేసీఆర్ దొందు దొందేనని ఫైర్‌ అయ్యారు. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు బీజేపీనీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వైఎస్‌ షర్మిల. టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news