బండి సంజయ్ కి జేపీ నడ్డా ఫోన్… బీజేపీ నాయకత్వం అండగా ఉంటుందని హామీ.

-

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. అయితే బండి సంజయ్ ఆఫీసుకు ఫోన్ చేయగా.. ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. సంజయ్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా జేపీ నడ్డా వారికి చెప్పినట్లు సమాచారం. ఉపాధ్యాయుల పక్షాన బండి సంజయ్ పోరాటం భేష్ అని కొనియాడినట్లు తెలుస్తోంది. కేసులపై కోర్టుల్లో పోరాడం చేస్తామని.. బండి సంజయ్ కి కేంద్ర నాయకత్వం మద్దతు ఉంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.

jp-nadda

అయితే ఉపాద్యాయ బదిలీలపై, జీవో 317ను సవరించాలని నిన్న కరీంనగర్ లో తన ఆఫీసులో ’జాగరణ దీక్ష‘కు దిగారు. అయితే ఈ ధీక్షను భగ్నం చేశారు పోలీసులు. అనేెక నాటకీయ పరిణామాల మధ్య నిన్న రాత్రి బలవంతంగా బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ ప్రబలుతున్న సమయంలో.. నిబంధనలు పాటించకుండా దీక్షకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ తో పాటు 25 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 60 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news