తెలంగాణలో లాక్ డౌన్.. హెల్త్ డైరెక్టర్ క్లారిటీ

-

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జనవరి పదో తారీకు వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి తరుణంలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ లోడ్ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగితే, లాక్ డౌన్ లేదట కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు.

కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ వయస్సు వారికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కోరారు శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news