సినిమా టికెట్ల పై చర్చకు సిద్ధమా.. పేర్ని నానికి ఆర్జివి సవాల్

-

సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కి రామ్ గోపాల్ వర్మ మరోసారి కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల వ్యవహారంపై తాను చర్చ కు సిద్దమని.. ఏపీ సర్కార్ దీనికి సిద్దంగా ఉందా అని సవాల్ విసిరారు. పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం పెదాల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదని చురకలు అంటించారు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముందని… నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని పేర్కొన్నారు.

సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడన్నారు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడని ఎద్దేవా చేశారు.

“థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి. థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా.మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.” అని పేర్కొన్నారు. దీనిపై చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news